తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు లారీలు, బస్సులు, ఆటోలు, మరియు ఇతర వాణిజ్య వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిఫ్లెక్టివ్ టేపులు, సేఫ్టీ పరికరాలు, టైర్ల స్థితి వంటి అంశాలను తనిఖీ చేశారు.డ్రైవర్లకు మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక లోడుతో వాహనం నడపరాదని, అలాగే హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.పోలీసు అధికారులు మాట్లాడుతూ —“రోడ్డు భద్రత మనందరి బాధ్యత. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రజల ప్రాణ భద్రతే మా ముఖ్య ధ్యేయం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *