తొలి శుభోదయం ఒంగోలు:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కోతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.కోతపట్నం పీఎస్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు ఓపెన్ బూజింగ్
జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ మద్యం సేవిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యల వల్ల ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు ప్రమాదాలు సంభవించే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఓపెన్ బూజింగ్ పై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరించి, బహిరంగ మద్యపానాన్ని నివారించేందుకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *