తొలి శుభోదయం కందుకూరు:-

లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ శుభాకాంక్షలు క్రైస్తవ సోదర సోదరీమణులతో పాటుగా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. క్రీస్తు జన్మదినం లోకానికి వెలుగులను తీసుకువచ్చిందని, మానవాళి అందరికీ మంచిని పంచిందని క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ,వాత్సల్యాలను ప్రజలందరూ పాటించి తమ వ్యక్తి గత జీవితాలను ఆనందమయంగా మలుచుకోవాలని కోరుతూ క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రపంచ మానవాళి రక్షణ కొరకు ప్రభువైన ఏసుక్రీస్తు కన్యగర్భమున జన్మించి పాపులను రక్షించుటకు రక్తం ద్వారా పాప విమోచన కాగించారని ఆయన జీవించినంత కాలం బోధించిన ఆదర్శాలు ఆచరణీయమని తెలిపారు. ఈ క్రిస్మస్ ను క్రైస్తవ సోదరులందరూ ఆనందోత్సవాల మధ్య బంధు,మిత్రులతో కలిసి ఉమ్మడి కుటుంబాల సమక్షంలో క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *