ఎం పి డి ఓ.దేవ సేన కుమారి.

తొలి శుభోదయం టంగుటూరు:-

టంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు 17:12:2015 తేదిన ప్రభుత్వ పథకాలై -ఆవగాహన కార్యక్ర lమ మును సార్డ్స్ సంస్థ ‘ఆక్సిస్ టు జస్టిస్ పర్ చిల్డ్రన్ “వారి సహకారంతో ఎం పి డి ఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రములో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి అయిన ఆర్ దేవసేన కుమారి మాట్లాడుతూ గతంలో మహిళా సంరక్షణా కార్యదర్శిలు మండలం స్థాయిలో నిర్వహించిన సర్వేలో నిస్సయా బాలలను మరియు కుటుంబాలను గుర్తించడం జరిగింది.ఆ గుర్తించిన కుటుంబాల స్థితికి సంబంధించి అందవలసిన ప్రభుత్వ పథకాలను అందించి, ఆ కుటుంబాలను నిస్సయాత నుండి కాపాడాలని వారు అన్నారు.
తదుపరి మండల రెవెన్యూ అధికారి జి. ఆంజనేయులు మాట్లాడుచూ,మండలంలో బాలబాలికలు అందరు కూడా వారికి కావలసిన మరియు అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలన్ని వారు పొందే విధముగా కృషి చేయాలన్నారు.మండల విధ్యాశాఖ ఆనందరావు మండల పరిధిలోని బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలని, అదే విదంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిపుచ్చుకోవాలన్నారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ కార్యదర్శిలు, సార్డ్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిరాల శ్రీనివాసరావు, సుమన్, బాలకాశమ్మ,
తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *