తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన (Open Drinking / Open Boozing) ప్రాంతాల తొలగింపు, శుభ్రత మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఒంగోలు–I టౌన్, జె. పంగులూరు, దొనకొండ (ఎక్స్ రోడ్), పొన్నలూరు, మద్దిపాడు మండలం గ్రోత్ సెంటర్, దర్శి, చిమకుర్తి, అద్దంకి, కురిచేడు, కొండపి, కొరిశపాడు , తాళ్లూరు మండలం తూర్పు గంగావరం అవుట్‌స్కర్ట్స్, ముత్తరశివరిపాలెం, కర్నూలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ (ఉలవపాడు PS పరిధి), కందుకూరు టౌన్, బాలికురవ మండలం, వి.వి.పాలెం, మార్రిపూడి, పొన్నలూరు–విప్పగుంట రోడ్, జరగుమల్లి, ఎస్‌.ఎన్‌. పాడు, పామూరు, సంతమాగులూరు మండలం ఎల్చూరు గ్రామం, ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామం, కే.కె. మిట్ల PS పరిధి, NH–16 మన్నేటికోట జంక్షన్ (ఉలవపాడు PS), తదితర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది మున్సిపల్/పంచాయతీ కార్మికులు, స్థానిక గ్రామస్తులు, గ్రామ పెద్దల సహకారంతో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఉన్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర చెత్తను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.అదేవిధంగా పలుచోట్ల బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులు మరియు పౌరులతో ప్రమాణం (ఓత్) చేయించి, బహిరంగ మద్యం సేవనాన్ని మానుకోవాలని, సామాజిక చెడులను దూరం పెట్టాలని అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధం అని, ఇది ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని పోలీసులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, నేరాలకు దారితీసే ప్రమాదాలపై కూడా అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.ప్రజా ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని, భవిష్యత్తులో కూడా బహిరంగ మద్యం సేవనానికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శుభ్రమైన, సురక్షితమైన ప్రకాశం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *