తొలి శుభోదయం మార్కాపురం:-

ప్రజా శాంతి భద్రతలు కాపాడటం, సమాజంలో ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియుమార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రదేశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలు మరియు ప్రధాన రహదారుల పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఉన్న మద్యం సీసాలు, వ్యర్థాలను తొలగించి శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ మద్యపానం వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యాలు, మహిళలు మరియు పిల్లల భద్రతపై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.అదేవిధంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, చట్టపరమైన నిబంధనలను వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల సహకారంతోనే సమాజాన్ని మద్యం దుష్ప్రభావాల నుండి కాపాడవచ్చని, బహిరంగ మద్యపానం వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *