ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 37 ఫిర్యాదులు
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.సోమవారం మార్కాపురం, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా నూతన జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంభందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి,నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు, త్రిపురాంతకం సీఐ అసం, గిద్దలూరు అర్బన్ సీఐ కె.సురేష్, పొదిలి సీఐ రాజేష్ కుమార్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
