తొలి శుభోదయం పోలీస్:-

మార్కాపురం జిల్లా కనిగిరి మండలంలోని తాళ్లూరు గ్రామంలో నిర్వహించనున్న బ్రహ్మగారి తిరునాళ్ల నేపథ్యంలో కనిగిరి డీఎస్పీ గారు గ్రామాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, రహదారులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించి, శాంతి భద్రతలకు భంగం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని, అలాగే సీసీటీవీ కెమెరాల వినియోగం, తగినంత పోలీస్ సిబ్బంది నియామకం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.పాడు ఎస్‌ఐ సహా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మగారి తిరునాళ్లు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సాగేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని డీఎస్పీ తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *