ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా మన జలాల్లోకి ప్రవేశించకుండా తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు, డ్రోన్లతో నిరంతరం నిఘా
సీఎం చంద్రబాబు నాయుడు కడలిపుత్రులకు ఏ కష్టం రానివ్వరు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం:-
మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…కడలూరు బోట్ల అక్రమ చొరబాటును అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు అత్యున్నత కమిటీని నియమించి సమీక్షిస్తున్నారు. నాలుగు మెకనైజ్డ్ బోట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా మన జలాల్లోకి ప్రవేశించకుండా తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు, డ్రోన్లతో నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు కడలిపుత్రులకు ఏ కష్టం రానివ్వరు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ. 20 వేలకు పెంచాం. సబ్సిడీకి వలలు, మోటార్ బోట్లు అందిస్తున్నాం. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.