తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ అవగాహన మరియు డౌన్‌లోడ్/ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా H.Q. Team–1 ఆధ్వర్యంలో ఒంగోలు RTC బస్ స్టాండ్‌లో ప్రజలకు శక్తి యాప్ వినియోగం, ప్రాముఖ్యతపై సవివరంగా అవగాహన కల్పించి, మహిళల మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు.అదేవిధంగా పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా శక్తి యాప్ ఇన్‌స్టాలేషన్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించి, మహిళలు మరియు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా లభించే SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్, డయల్ 112/100, మహిళా హెల్ప్‌లైన్ 181 వంటి సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రాయోగికంగా వివరించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, మహిళలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా శక్తి యాప్‌ను వినియోగించి వెంటనే పోలీసుల సహాయం పొందాలని సూచించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే శక్తి యాప్ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని ప్రతి మహిళ శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసి వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.మహిళల భద్రత, సమాజ శాంతి పరిరక్షణ లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *