తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా Shakthi App డౌన్‌లోడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు ప్రజలకు Shakthi App ఉపయోగం, అత్యవసర పరిస్థితుల్లో SOS అలర్ట్ పంపే విధానం, పోలీస్ సహాయం తక్షణమే ఎలా అందుతుందనే అంశాలపై సవివరంగా వివరించారు. మహిళలు తమ మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, భద్రతకు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.పోలీసులు మాట్లాడుతూ, Shakthi App మహిళలకు రక్షణ కవచంలా పనిచేస్తుందని, చిన్న సమస్య అయినా పెద్ద ప్రమాదాన్ని నివారించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని, ప్రజలు పోలీస్ శాఖతో సహకరించాలని కోరారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మహిళల్లో భద్రతపై నమ్మకం పెరిగి, సమాజంలో సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *