తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ డౌన్లోడ్ మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ప్రకాశం జిల్లా పోలీసు హెచ్‌క్యూ ఆధ్వర్యంలోని శక్తి టీమ్–1 ప్రజలకు శక్తి యాప్ ప్రాధాన్యతను వివరించి, ప్రత్యక్షంగా మొబైళ్లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో, Shakti SOS, లైవ్ లోకేషన్ షేరింగ్, తక్షణ పోలీస్ స్పందన వంటి ఫీచర్లపై అవగాహన కల్పించారు.అదేవిధంగా మార్కాపురం ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో కూడా శక్తి యాప్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రయాణికులు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.ఇక అద్దంకి పట్టణంలో దార్సి శక్తి టీమ్ ఆధ్వర్యంలో, సీఐ అద్దంకి సమక్షంలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మహిళలపై జరుగుతున్న నేరాలను నివారించడంలో శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని, ఎటువంటి ఆపద ఎదురైనా ఒక్క క్లిక్‌తో పోలీసుల సహాయం పొందవచ్చని వివరించారు.అదనంగా ఒంగోలు హెచ్‌క్యూ శక్తి టీమ్–2 ఆధ్వర్యంలో కూడా శక్తి యాప్ డౌన్లోడ్ కార్యక్రమాలు నిర్వహించబడి, పెద్ద సంఖ్యలో ప్రజలు యాప్‌ను తమ మొబైళ్లలో ఇన్స్టాల్ చేసుకున్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా, ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. శక్తి యాప్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని, తమ భద్రతను తాము మరింత బలంగా చేసుకోవాలని జిల్లా పోలీసు అధికారులు పిలుపునిచ్చారు.