తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు, మహిళల భద్రత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శక్తి యాప్’ (Sakthi App) అవగాహన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో OGL.Hq.Team II, శక్తి టీమ్స్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.వి.వి. పాలెం, దర్శి ప్రాంతాలతో పాటు మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో మహిళలకు, విద్యార్థినులకు మరియు ప్రయాణికులకు యాప్ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా OGL.Hq.Team II మరియు శక్తి బృందాలు స్వయంగా మహిళల మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.ఆపద సమయంలో కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా లేదా ఫోన్‌ను వేగంగా ఊపడం ద్వారా పోలీసులకు సమాచారం ఎలా చేరుతుందో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపారు. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణకు ఈ యాప్ ఒక కవచంలా పనిచేస్తుందని, ప్రతి మహిళా దీనిని విధిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *