తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా
సింగరాయకొండ మండల పరిధిలో ప్రతిపాదిత ఎమర్జెన్సీ లాండింగ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. “మాకొద్దు మాకొద్దు ఎమర్జెన్సీ లాండింగ్” అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎమర్జెన్సీ లాండింగ్ ఏర్పాటుతో తమ సాగు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని, రైతుల జీవనాధారం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిరసనకు ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని, రైతులు, దళితుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమర్జెన్సీ లాండింగ్ పేరుతో రైతులకు అన్యాయం చేస్తే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *