తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణ మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు, లేన్ క్రమశిక్షణ, వేగ నియంత్రణ, సిగ్నల్స్ పాటించడం, సరైన పార్కింగ్, ప్రయాణికుల భద్రత, హెల్మెట్ వినియోగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రజల భద్రతకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు.ఈ కార్యక్రమం మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.