తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో గ్రామస్తులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, హెల్మెట్ లేకపోతే జరిగే రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు గురించి వివరించారు.అలాగే సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. సైబర్ మోసాల బారిన పడిన వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు.
గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి వివరించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.మహిళలపై జరుగుతున్న నేరాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించి, మహిళలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, డయల్ 112, షీ టీమ్స్ సేవలు, పోలీస్ సహాయాన్ని నిర్భయంగా పొందాలని గ్రామస్తులకు తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తుల్లో చట్టాలపై అవగాహన పెంచి, నేరరహిత సమాజ నిర్మాణానికి సహకరించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.