తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
షేక్ మస్తాన్ వలి (ఒంగోలు వాస్తవ్యులు) అనే వ్యక్తికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వలన O+ (పాజిటివ్) రక్తం 2 యూనిట్లు అవసరమైంది. ఆ గ్రూప్ రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న విషయాన్ని sk.నాయబ్ రసూల్ ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ సభ్యులకి తెలియపరిచారు.
ఆ పోస్ట్ కి స్పందించినా ఫౌండేషన్ ఇంచార్జీ ఆయుబ్ ఖాన్ పఠాన్ రక్తదానం చెయ్యటానికి వెంటనే ముందుకొచ్చి వారికి భరోసా కల్పించి మంగళవారం రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతని చాటుకొని ప్రాణదాతలుగా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినా ఆయుబ్ ఖాన్ పఠాన్ గారిని రక్తం పొందిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.