తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు కనిగిరి సీఐ నాయకత్వంలో, రోడ్ సేఫ్టీ వారియర్స్ సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, అతి వేగం, తప్పు దారిలో డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత వంటి అంశాలపై వివరించారు.ప్రజలు తమ ప్రాణ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో పెదచెర్లపల్లి ఎస్సై పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *