హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు ప్రాణానికి రక్షణ.
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన కూడలి, బ్లాక్ స్పాట్స్/ఆక్సిడెంట్ ప్రొనె ఏరియా వద్ద ప్రజలకు, వాహనచోదకులకు అవగాహన ఫెక్సీలు ఏర్పాటుచేయటం, జాతీయ రహదారి పై రోడ్డు భద్రత, రక్షణ, అతివేగం వంటి విషయాలపై సంకేత బోర్డులతో అవగాహన కల్పించారు. రహదారులపై ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని, తప్పనిసరిగా ప్రామాణిక కలిగిన హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఎక్కువ స్పీడ్ తో వెళ్లరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీస్ అధికారులు కోరారు.