తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ర్యాలీని సబ్ ఇన్స్పెక్టర్ గారు స్థానిక విద్యార్థులతో కలిసి నిర్వహించారు.“ప్రతి డ్రైవర్ మరియు పాదచారి రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని తెలిపారు.ర్యాలీలో విద్యార్థులు రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.