తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర ఉల్లంఘనల వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం గురించి వాహనదారులకు వివరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, వేగ నియంత్రణ పాటించాలి, రహదారి నిబంధనలను గౌరవించాలి అని పోలీసులు సూచించారు.అవగాహన కార్యక్రమంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు మరియు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, రహదారులపై ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *