తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
భక్తుల ఇలవేల్పు, కొంగు బంగారు పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఈ నెల 2 వ తేదీన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణ వేణి ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం లో భక్తులు, మోత కాపులు, సనాతన ధర్మ సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. వారు మీడియా తో గిరి ప్రదక్షిణం గురించి వివరిస్తూ లక్ష్మి నారసింహ క్షేత్రం లో భక్తుల భాగస్వామ్యం తో చేపట్టి ముందుకు తీసుకు పోవడం జరుగుతుందన్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ నారసింహ క్షేత్రం ఎంతో ప్రాశస్త్యం చెందిందన్నారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా ఈ క్షేత్రం లో గిరి ప్రదక్షిణ జరుగుతుందని పేర్కొంటూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాబోయే రోజుల్లో భక్తుల లో పెరిగే విశ్వాసం గిరి ప్రదక్షిణ కి మంచి ఉత్సాహాన్ని తెస్తుందన్నారు. ఈ నెల 2 వ తేదీన గిరి ప్రదక్షిణ లో భజన బృందాలు, భక్త సమాజాలు, లక్ష్మి నారసింహ స్వామి భక్తులు సనాతన ధర్మ సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. గిరి ప్రదక్షిణ 2 వ తేదీన గురువారం ఉదయం 7 గంటలకు పాత సింగరాయకొండ దక్షిణ మెట్ల మార్గం వద్ద గల మండపం వద్ద నుండి ప్రారంభం అవుతుందని భక్తులు సమయానికి రావాలని పిలుపు ఇచ్చారు.