తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ లోటస్ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడేలా వివిధ వేషధారణలో పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో లోటస్ స్కూల్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది అని ఆ రోజు ప్రపంచాన్ని నడిపే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారని అందుకే మకర సంక్రాంతిగా మనం పండగ చేసుకుంటామని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముందస్తుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *