తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

పాఠశాలలో తరగతి గదులు, హాస్టల్ గదులు, బాత్రూములు, వంటగది మరియు పరిసరాలను పరిశీలించాను. విద్యార్థినులతో మాట్లాడి, హాస్టల్‌లో వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నాను.ఈ సందర్భంగా బాత్రూముల వద్ద నీరు నిల్వ ఉండటం, మురుగునీరు క్లాస్‌రూమ్‌ల సమీపంలో నిలిచిపోవడం గమనించాను. ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు విద్యార్థినుల ఆరోగ్యానికి హానికరమని భావించి, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించాను.హాస్టల్ గదుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మళ్లీ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాను. మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించి, నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని సూచించాను.విద్యార్థినులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వరండాలో ఫ్లోరింగ్ ఎత్తు పెంచాలని అధికారులకు తెలియజేశాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *