తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ/ జరుగుమల్లి,:-
రోడ్డు ప్రమాదాల నివారణ, నియంత్రణ లో భాగంగా వాహన దారులు వారి వారి వాహనాలకు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ ఒంగోలు ఉప కమీషనర్ సుశీల పిలుపు ఇచ్చారు. ఆమె ఆమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఒంగోలు,దర్శి,కందుకూరు,మార్కాపురం కార్యాలయాల పరిధిలో జరిగే వాహన ఫిట్ నెస్ పరీక్షలు ఇక నుండి మద్గిపాడు మండలం అన్నంగి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ వద్ద గురువారం నుండి జరుగుతాయని తమ వాహనాలను ఆల్ఫీకి తీసుకు రావాలని సూచించారు. ఈనెల 8 తేదీకి ముందు ఫిట్నెస్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు దాన్ని రద్దు చేసుకుని తిరిగి 9 వ తేదీ కి బుక్ చేసుకోవాలని కోరారు.