తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ తన పుట్టినరోజు వేడుకలను, కందుకూరు పట్టణంలోని స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఆదివారం జరుపుకున్నారు. బంధువులు, మిత్రులు, సన్నిహితులతో కలిసి పాఠశాలలో కేక్ కట్ చేసి, దివ్యాంగ విద్యార్థులకు తినిపించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సుబ్బారెడ్డి సహా సిబ్బంది, వార్డు నాయకులు సందీప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు సందీప్ ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు. సాయంత్రం విద్యార్థులందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య, కుమారుడు అవినాష్, పార్టీ నాయకులు నల్లూరి సూర్యనారాయణ, ముప్పవరపు వేణు, గుమ్మ శివ మచ్చ మనోహర్ చల్లా మహేంద్ర, చుంచు వేణు కొండలరావు అత్తంటి శివకృష్ణ నాదెండ్ల మధు, కొండల్, లక్ష్మణరావు, చక్క కేశవ, బద్దిపూడి శికామణి పాల్గొన్నారు..