తొలి శుభోదయం టంగుటూరు:-

విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలనీ టంగుటూరు మండల విద్యాశాఖాధికారులు చెల్లి ఆనందరావు, మహతి బాలాజీ కోరారు. విద్యాంజలి 2.0 కార్యక్రమం పై శనివారం వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖాధికారులు ఆనంద్ , బాలాజీ గార్ల అధ్యకతన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి మండలం లోని క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మండలం లోని ప్రభుత్వ పాఠశాలలన్ని తప్పనిసరిగా విద్యాంజలి 2.0 పోర్టల్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, పాఠశాలల అవసరాలను ఆ పోర్టల్ లో నమోదు చేయాలనీ,పాఠశాలల అభివృద్ధి కి సహకరించగల దాతలను గుర్తించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగస్వాముల్ని చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా అన్నపూర్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు చలపతిరావు, సుధారాణి, రమణయ్య, రాంబాబు , భ్రమరాంబ, బ్రహ్మయ్య, సి ఆర్పీ లు, కంప్యూటర్ ఆపరేటర్ బాలకృష్ణ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *