తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యాంజలి ప్రాజెక్టుపై సింగరాయకొండ మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు
స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఆవుల శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ, విద్యాంజలి ప్రాజెక్టు ద్వారా పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా విద్యాంజలి ప్రాజెక్టు లక్ష్యాలు, విధానాలు, ఆన్‌లైన్ పోర్టల్ వినియోగం, దాతల నుండి విరాళాల స్వీకరణ విధానం, పారదర్శకత, పాఠశాల అభివృద్ధి అవసరాల గుర్తింపు తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులకు విపులంగా అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాల తన అవసరాలను స్పష్టంగా నమోదు చేసి, స్థానికంగా దాతలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని పేర్కొన్నారు.శిక్షణ కార్యక్రమంలో సీఆర్పీలు, ఎంఆర్‌పీలు, పాఠశాల విద్యా విభాగ అధికారులు పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రత్యక్ష ఉదాహరణల ద్వారా విద్యాంజలి ప్రాజెక్టు అమలు విధానాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో
స్వచ్చంద సంస్థ ప్రతినిధి న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు,మండలంలోని వివిధ పాఠశాలల మరియు ప్రధానోపాధ్యాయులు,పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *