తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు వన్ టౌన్ సీఐ గారు PVR గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రత & ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం,సైబర్ నేరాలు – ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, అపరిచిత లింకుల ప్రమాదాలు,మహిళలపై నేరాలు – చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు చేసే విధానం, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలు సీఐ మాట్లాడుతూ, విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు కట్టుదిట్టంగా పాటిస్తూ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, మహిళల భద్రతకు ప్రభుత్వం కల్పించిన చట్టపరమైన రక్షణలను సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెరిగి, బాధ్యతాయుత పౌరులుగా మారేందుకు ఇది దోహదపడుతుందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *