తొలి శుభోదయం గిద్దలూరు:-

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (APVCEU) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికి శుక్రవారం గిద్దలూరులో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, డిస్కం సంస్థల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, తగిన వేతనాలు అందకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
వినతి పత్రంలో ముఖ్యంగా
విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని,
2026 పీఆర్సీని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని,
2025 అక్టోబర్ 17న AP పవర్ జేఏసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం కనీస వేతనాన్ని రూ.25,000గా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే APGENCO, APTRANSCO, APDISCOMs పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు 24×7, 365 రోజులు నిరంతర సేవలు అందిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు, భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలపై మంత్రి గొట్టిపాటి రవి సానుకూలంగా స్పందించి, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *