తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనీ,ఎక్కడైనా వెట్టి చాకిరి బాధితులు ఉన్నట్లయితే వారిని గుర్తించాలని, గిద్దలూరు తహసీల్దారు ఆంజనేయ రెడ్డి పిలుపు నిచ్చారు.వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 అమలు 50 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వర్ణోత్సవాల వేడుకలు ఫిబ్రవరి 09 నుండి 15 తేదీ వరకు జరుగుచున్నందున మార్కాపురం జిల్లా వెట్టి విమోచన కోలీషం ఆధ్వర్యంలో గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం లో మార్కాపురం జిల్లా కన్వీనర్ నంది నాగయ్య అద్యక్షతన ,తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి,సీనియర్ అడ్వకేట్ , నోటరీ అయిన ఎస్ కే యాసిన్ భాష చేతులమీదుగా గోడ పత్రికను,కరపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ వ్యవస్థ బాధితులను గుర్తించి వారిని బానిసత్వం నుండి విముక్తి కలిగించి ,పునరావాసం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు,అడ్వకేట్ యాసిన్ భాష మాట్లాడుతూ వెట్టి చాకిరి వ్యవస్థ ను ప్రోత్సహించిన,లేదా ఆర్థిక దోపిడి, బానిసత్వం ప్రోత్సహించినవారికి 3 సంవత్సరములు జైలు శిక్ష,2 వెల రూపాయలు జరిమాన విధించ బడునని అన్నారు,ఈ కార్యక్రమంలో వెట్టి విమోచన వేదిక గిద్దలూరు డివిజన్ కన్వీనర్ చిట్లూరి ఏలియా, స్పీడ్ ఎన్జీవో డి.యోబు,రీడ్ సంస్థ ప్రతినిధి బ్లెస్సింగ్ టన్,బాబ్జీ,లార్డ్ ఎన్ జీ ఓ ఎన్ ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *