తొలి శుభోదయం కందుకూరు:-

మన కందుకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర , మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై కీలక విషయాలు చర్చించాం: రూ. లక్ష కోట్లతో బీపీసీఎల్ (BPCL), రూ. 50 వేల కోట్లతో ఇండోసోల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీటి ద్వారా మన ప్రాంత యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మాలకొండ పుణ్యక్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం ‘రెండవ ఘాట్ రోడ్డు’ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి. కొండపై పైన లక్ష్మీ అమ్మరివారి ఆలయ రూపురేఖలు మారకుండా రిపేర్ స్లాబ్ పనులు పూర్తి చేస్తాం.
కందుకూరు అంకమ్మ తల్లి ఆలయ అభివృద్ధి, షాపుల నిర్మాణం, పూజారులకు క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ‘సూపర్ సిక్స్’ హామీలను పక్కాగా అమలు చేస్తూ, ప్రజలపై భారం పడకుండా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాం. సహకరించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *