తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణలో మరింత సమర్థవంతంగా ముందుకెళ్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ‘MSCD’ పరికరాల ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించి, వెంటనే డిజిటల్ డేటాబేస్‌తో సరిపోల్చి నేర చరిత్రను గుర్తిస్తున్నారు.బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ కూడళ్లు వంటి కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, పాత నేరస్తులను క్షణాల్లో గుర్తించేలా చర్యలు చేపట్టారు. ఈ సాంకేతిక విధానం ద్వారా నేరాల నివారణలో వేగం పెరగడమే కాకుండా, దర్యాప్తులో ఖచ్చితత్వం కూడా గణనీయంగా మెరుగుపడుతోంది.‘స్మార్ట్ పోలీసింగ్’ ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేస్తూ, నేరాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *