తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఎక్కడెక్కడ తలెత్తే అవకాశం ఉంది వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలిఅడిగితెలుసుకున్నా అదేవిధంగా సాగర్ నీటి దగ్గరలో ఉన్న గ్రామాలను నీటితో నింపాలని తెలిపారు. చెడిపోయిన డీప్ బోర్ లను మరమ్మతులు చేయాలన్నారు.తాగునీటి సమస్యలు లేకుండా తక్షణమే స్పందించాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ సురేష్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.