తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
వై.పాలెం సర్కిల్లో సీఐ ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో పరిధిలోని ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ప్రత్యేకంగా UI కేసులు మరియు NBWs అమలుపై దృష్టి సారిస్తూ, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని సీఐ అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తు నాణ్యతను పెంచి, సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు.అలాగే, నేర నియంత్రణలో అప్రమత్తంగా ఉండి, ప్రజల భద్రతను కాపాడే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు. పెండింగ్ కేసులను నిర్దిష్ట గడువులో పూర్తి చేసి, శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.ప్రజలతో సాన్నిహిత్యం పెంపొందించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సమర్థవంతమైన పోలీసింగ్ ద్వారా నేరాలను అరికట్టాలని సీఐ సూచించారు.