తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లాలో ఇటీవల విలీనమైన పలు పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కొత్తగా అమలులోకి వచ్చిన క్రిమినల్ చట్టాల ప్రకారం, ప్రతి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించవలసిన రికార్డుల నిర్వహణ, రిజిస్టర్లు, ఫైలింగ్ విధానాలు, నూతన ప్రొఫార్మాలు మరియు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని గాలక్సీ కాంప్లెక్స్ లో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించిన నూతన క్రిమినల్ చట్టాలపై ప్రతి పోలీస్ అధికారి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే, కొత్త చట్టాలకు అనుగుణంగా రూపొందించిన అన్ని రిజిస్టర్లు తప్పనిసరిగా, సక్రమంగా మరియు సమయానుకూలంగా నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.నూతన చట్టాల ప్రధాన లక్ష్యం డిజిటలైజేషన్ మరియు వేగవంతమైన న్యాయం సాధన అని జిల్లా ఎస్పీ తెలిపారు. దీనిలో భాగంగా జీరో ఎఫ్‌ఐఆర్, ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్, ఈ కంప్లైనెంట్స్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పలు రికార్డుల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. అధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు, దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ-సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్ మరియు ఈ-సాక్ష్యం వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లు కూడా కొత్త ప్రొఫార్మా ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాల దర్యాప్తును నిర్ణిత సమయంలో పూర్తి చేయడానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలని సూచించారు.ప్రధానంగా పోలీస్ స్టేషన్‌లలో వలస కార్మికుల సమాచారమును ఎప్పటికప్పుడు సేకరించాలని, గ్రామ మరియు వార్డు ప్రొఫైల్ మ్యాపింగ్ ను పూర్తి సమాచారంతో సిద్ధం చేసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, సీసీటీవీ కెమెరాల స్థానాలు, దిశలు, కవరేజ్‌ను మళ్లీ సరిచేసి కీలక ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. డీజీపీ ఆఫీస్ నుండి వచ్చే ఫైల్స్ కు రెప్లయ్స్, గ్రేవ్ కేసులకు సంబంధించిన సీడీ ఫైల్స్ కు సంబంధించి ఇండెక్స్, అలాగే వివిధ చెక్ లిస్ట్‌ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు తెలియచేశారు. కొత్త చట్టాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని, అన్ని రికార్డులు సమయానుకూలంగా, ఖచ్చితంగా నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రాపర్టీ మరియు గవర్నమెంట్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. కొత్త మార్పుల ప్రకారం, ఛార్జ్‌షీట్ దాఖలు, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికల నమోదు, అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. రికార్డులన్నింటినీ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎస్పీ సిహెచ్. వి. బాలసుబ్రమణ్యం, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, కందుకూరు సిఐ షైక్ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ జి.మంగారావు, అద్దంకి సీఐలు డి.మల్లికార్జున రావు, సుబ్బరాజు, సంతమాగులూరు ఇన్స్పెక్టర్ కె.వెంకటరావు, పలు పోలీస్ స్టేషన్ SHOలు, అన్ని స్టేషన్ ల రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *