మేరా యువ భారత్ నెల్లూరు మరియు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరులోని శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి ఏ మహేంద్ర రెడ్డి ,కళాశాల ప్రిన్సిపాల్ పోలిశెట్టి గీతా శ్రీనివాసరావు,ఆర్. వెంకటేశ్వర్లు(రిటైర్డ్ హెచ్ఎం), శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు,సభ్యులు,కోట వెంకటేశ్వర్లు,కొత్త నరేంద్ర కుమార్ గార్లు హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ. మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సేవాభావం కలిగిఉండాలని,సమాజానికి నిస్వార్ధంగా సేవ చేసే స్వచ్ఛంద సేవకులను గౌరవించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం అని అన్నారు. మనం చేసే సేవ చిన్నదా లేక పెద్దదా అనేది ముఖ్యం కాదు సమాజం మార్పు కోసం చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఎంతో విలువైనదని అన్నారు.మరియు ఈ కార్యక్రమం గురించి రవ్వా శ్రీనివాసులు, ఆర్. వెంకటేశ్వర్లు,పి.గీతా శ్రీనివాసరావు,కోట వెంకటేశ్వర్లు గార్లు మాట్లాడుతూ ఎవరైతే తమ సొంత లాభం చూసుకోకుండా ఇతరుల కోసం లేదా సమాజం కోసం తమ సమయాన్ని మరియు శక్తిని వెచ్చించి సేవ చేసే వాళ్లే స్వచ్ఛంద సేవకులు అని,మీరు కూడా ఏదో ఒక రూపంలో సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ప్రపంచ స్వచ్ఛంద దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం గురించి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,నిర్వహించి విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *