కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం అనగా శనివారం ఉదయం డాక్టర్ బి.ఆర్ శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు..ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో వెనుకబడ్డ వారికి కూడా హక్కులు ఉంటాయని, వాటి ద్వారానే రాజ్యాధికారం పొందవచ్చని అంబేద్కర్ భావించి, రాజ్యాంగ రూపకల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఫలితంగానే నేడు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని తెలిపారు. ఆ సేవలకు గుర్తుగానే ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి, ఇప్పటికీ ఆయనను దేవుడిగా కొలుస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే విధంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, రాయపాటి శ్రీనివాసరావు, షేక్ రఫీ, గోచిపాతల మోషే, పులి నాగరాజు, రెబ్బవరపు మాల్యాద్రి, కోటపూరి శ్రీనివాసరావు, సుదర్శి శ్యామ్ ప్రసాద్, చనమాల శ్రీధర్, పాలేటి కోటేశ్వరరావు, డిసిహెచ్ మాలకొండయ్య, షేక్ రూబీ, షేక్ సలాం, ముచ్చు శ్రీనివాసరావు, షేక్ అహమద్ బాషా, చుండూరి శ్రీను, దార్ల శ్రీను, గేరా నరేష్, లెనిన్, సవిడిబోయిన కృష్ణ, గుమ్మ శివ, ఉమ్మనేని సుబ్బారావు,
షేక్ రూబీ, చంటి, షేక్ మూస మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *