తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏఐటియుసి, సిఐటియు నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలన వచ్చిన దగ్గర నుండి కార్మికుల హక్కులను కాలరాస్తూ పోరాడి సాధించుకున్న చట్టాలను సైతం నిర్వీర్యం చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పికొడుతూ నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కందుకూరు నియోజకవర్గం లో ఉన్న అన్ని సంఘాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్, సిఐటియు పట్టణ కార్యదర్శి సల్మా, సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఏ గౌస్, సిఐటియు పట్టణ నాయకులు డిఎం రాయుడు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *