తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో 27 సంవత్సరాలు సేవలందించిన షేక్ జాహిద ఉద్యోగ విరమణ మరియు సన్మాన మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. 1998లో ఐసీడీఎస్ సహాయకురాలిగా చేరిన ఆమె, 2025 వరకు విశ్వసనీయతతో, సేవాభావంతో పనిచేసి స్థానికులు, సహోద్యోగుల మెప్పు పొందారు.కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది మాట్లాడుతూ,
“జాహిద సేవలు అమూల్యం. అంగన్వాడి పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అండగా నిలిచి ఎన్నో కుటుంబాలను ఆదరించారు. ఆమె నిబద్ధత అందరికీ ఆదర్శం” అని ప్రశంసించారు.తన సేవలను గుర్తించి సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి ఆమెకు ఘనంగా సన్మానం నిర్వహించారు. పూలదండలు ఆలంకరించి, శాలువా కప్పి ఆమె సేవలను స్మరించుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *