తొలి శుభోదయం సింగరాయకొండ:-
కందుకూరు రోడ్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హోటల్ మధురమ్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డా. ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డా. మాదాసి వెంకయ్య, మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు . బత్తుల అశోక్ కుమార్ రెడ్డి పాల్గొని హోటల్‌ను ప్రారంభించారు.హోటల్ యజమాని, కొండేపి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ రాపూరి ప్రభావతి ని నాయకులు అభినందిస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమం అనంతరం హోటల్ యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించింది.