తొలి శుభోదయం కందుకూరు :-

కందుకూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట భరోసాగా నిలుస్తోందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *