తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం న్యూస్ :-

చెన్నిపాడు గ్రామం, పొన్నలూరు మండలంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న పండుగ/ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో డ్రోన్ నిఘా ఏర్పాటు చేయబడింది.ఆలయ పరిసరాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ఏవైనా అనూహ్య సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.బందోబస్తులో భాగంగా సీసీటీవీ పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పేట్రోలింగ్ బృందాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌ను మోహరించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు పోలీసు సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరడమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *