తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ స్కూల్లో అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని, నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన “డా. గీతా రాణి ” అమరవీరుల దినోత్సవం గురించి మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్రం, సమాజ శాంతి, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే రోజు. శుక్రవారం మనమంతా గర్వంతో కూడిన కన్నీళ్ళతో అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకుంటున్నాం. గాంధీజీ గారు అనుసరించిన అహింసా మార్గాన్ని, సత్యం, శాంతి వంటి విలువలను నేటి యువత తప్పనిసరిగా అనుసరించాలని, వారి త్యాగాలను స్మరించుకోవడంతోపాటు, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారడమే వారికి మనం చేసే నిజమైన నివాళి. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిదే అని ప్రతిజ్ఞ చేద్దాం. అని ప్రసంగించారు.
