తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు చురుకుగా పాల్గొన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను వివరించి, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.స్వచ్ఛమైన వాతావరణమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు.
స్వచ్ఛత, భద్రత, సేవ – ఈ మూడు అంశాలపై నిరంతరం ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *