తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం పాకల నందు నిర్వహించిన స్వచ్ఛ పాకల కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రజాబాబు , ఏపీ టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గార్లతో కలిసి పాల్గొన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య ముందుగా ఈ నెల 14, 15 వ తేదీలలో జరగనున్న పాకల బీచ్ ఫెస్టివల్ ఏవీ ని విడుదల చేసి, అనంతరం పాకల బీచ్ లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం అని తెలియజేసి, ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.ఈ పాకల బీచ్ ఫెస్టివల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాకల పేరు ప్రఖ్యాతి చెందుతుందని తెలిపారు.