తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణ నష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ద్విచక్ర వాహనదారుల కోసం హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలు కలిగే అవకాశాలు గురించి వివరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించుకోవచ్చో డ్రైవర్లకు స్పష్టంగా అవగాహన కల్పించారు.ప్రతి ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడపాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *