తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో కొండపి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అంబేద్కర్ గురుకులం స్కూల్‌ను సందర్శించి మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రత, ఈవ్‌టీజింగ్, వేధింపులపై చట్టాలు, డయల్–100, 112 మరియు శక్తి యాప్ వంటి ముఖ్యమైన అంశాలపై వివరించి అవగాహన కల్పించారు.అలాగే ఏదైనా వేధింపు, అనుమానాస్పద ఘటన కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, భయపడకుండా తమ హక్కులను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
సమాజంలో మహిళల భద్రతను కాపాడేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు అండగా ఉంటారని అధికారులు తెలిపారు.