తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా పోలీసులు వాహన తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులు, పట్టణ ప్రాంతాలు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, హెల్మెట్ వాడకం, ఓవర్లోడ్ వంటి అంశాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను చెక్ చేసి, అవసరమైన చోట్ల కౌన్సెలింగ్ మరియు లీగల్ యాక్షన్ తీసుకున్నారు.జిల్లాలో శాంతి భద్రతలనుమెరుగుపరచడం, నేరాల నివారణ చేయడం మరియు ప్రజల భద్రతను కాపాడడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.