తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:-
గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిమ్మాపురం గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో జరుగుతున్న జూదంపై గిద్దలూరు పోలీసులు ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.80,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూదానికి ఉపయోగించిన సామగ్రిని కూడా స్వాధీనం చేశారు.అక్రమ జూదం వంటి కార్యకలాపాలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని గిద్దలూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.